
మొత్తనికి ఆ ఒక రోజు రానె వచ్చింది. నేను పీజీ కాన్వకేషన్ సర్టిఫీకెట్ తీసుకోలెదు,ఆ ఊరు వెళ్ళి తీసుకుందాము అని నిర్ణయించుకున్నము నేను మా వారు.ఇంతలో మా వారి ఫ్రెండ్ ఫోను చేసి వాళ్ళ చెల్లి ది ఏదో పీజీ డిప్లోమా
సర్టిఫీకెట్ కూడ ఉంది తీసుకురమ్మన్నాడు.అదేమిటీ అలా ఎలా ఇస్తారు,మనిషి లేకుండా అన్నాను సీరియస్సు గా.అదేమీ పీహెచ్ డీ సర్టిఫీకెట్ కాదు కదా,తేవచ్చులే కాస్త మేనేజ్ చేస్తే అని నా నోరు నొక్కేసారు.మొత్తానికి ఆ అమ్మాయి పేరు,డేటాఫ్ బర్త్,కాలేజీ పేరు నాతో బట్టీ పట్టించారు.
యూనివర్శిటీ కి వెళ్ళి నా సర్టిఫీకెట్ తీసుకున్నాకా ఆ అమ్మాయి సర్టిఫీకెట్ కోసం వెరే డిపార్ట్ మెంట్ కి వెళ్ళాము.వెళ్ళేముందు మా వారు చిన్నపటి నుండీ తిన్న నా చ్యవనప్రాశ్ శక్తి కి ఒకసారి పరీక్ష పెట్టి పాస్ అనుకున్న తరువాత క్లర్క్ దగ్గరకి పంపారు.
అక్కడకి వెళ్ళి నేను ఫలానా సర్టిఫీకెట్ కావాలని అడిగాను.ఒకసారి అలా మొహం లోకి చూసి ఆ ఫైల్ తీసాడు క్లర్కు.ఆ ఒక్కసారి చూసిన చూపుకే వణికిపోయాను పట్టేసాడా ఏమిటి అని.దూరం గా ఉన్న మా వారి మొహం చూసా ఒకసారి.ఏమీ కాదు అని విష్ణు మూర్తి లాగ కళ్ళ తోనే అభయం ఇచ్చేసరికి ధైర్యం వచ్చేసింది నాకు.
ఇంతలో ఆ క్లర్కు సెర్టిఫీకెట్ ఇచ్చి సంతకం పెట్టమని రిజిస్టర్ ఇచ్చ్హాడు.సడెన్ గా వచ్చే టీవి యాడ్ లాగ ఇంకొకతను టీ తాగుతూ చిద్విలాసం గా వచ్చి ఎంటి కబుర్లు అంటూ ఈ గుమాస్తా తో కబుర్లు మొదలెట్టాడు.ఆగు ఈ సర్టిఫీకెట్ ఇచ్చి మాట్లాడతా అన్నాడు.వెంటనే రెండో శాల్తీ,ఏమి సర్టిఫీకెట్టు,అలా ఎలా ఇచ్చెస్తావు,కనీసం ఐడీ కూడా లేకుండా అనేసరికి నా గుండెలు జారిపోయాయి.
హా,అవును కదూ,అమ్మాయ్ నీ ఐడీ కార్డు చూపించు అన్నాడు.తెలంగాణా ఇదిగో అని అరచేతిలో చూపించి చటుక్కున వెనక్కి తగ్గితే కేసీఆర్ ఫేసు ఎలా ఉంటుందో అలా అయ్యింది నాది కూడా.
ఐడీ..అదండీ..తేలేదు..ఊరినుండి వచ్చే హడావిడిలో మర్చిపోయాను అని అలా కోక్ నమిలా(నీళ్ళు బదులు కోక్ నమిలా అన్నమాట..అర్ధం చేసుకోరు).ఇంతలో మా వారు దగ్గరకి వచ్చి నిలబడ్డారు.ఐడీ మర్చిపోయాం సార్,మాకు మళ్ళీ వచ్చే టైం కూడా లేదు అని శాంతి స్వరూప్ ని మించి ఎంతో దీనంగా చెప్పేసరికి క్లర్కు కాస్త మెత్తబడి,సరే కాని కనీసం నీ డేటాఫ్బర్త్ చెప్పు అన్నాడు.
ఓయెస్,అనుకుంటూ తడబడకుండా చెప్పేసా,తడబడితే అనుమానిస్తాడని."మీ ఇంటి పేరు?" అంటూ మరో మిసయిల్ దూసుకొచ్చింది.అదీ చెప్పాను(మా వారి ఫ్రెండు ఇంటి పేరు తెలుసు నాకు) మా వారు ఇచ్చిన కోచింగు లో ఇది లేకపోయినా సర. వెంటనే మా వారి వైపు విజయగర్వతో ఒక చూపు కూడా విసిరా,చూడండి అన్నట్లు.మీ నాన్నగారి పేరు?...ఈ ప్రశ్న వినగానే నా గుండెలు జారిపోయాయి,ఓరి నాయనో,10 th క్లాస్ పరీక్ష లో పీజీ కొచ్చన్ వచ్చినంత గా ఫీల్ అయిపోయాను.
వెంటనే మా వారు నోటికి వచ్చిన పేరు చెప్పారు.మీరు చెప్తారేమిటి ఈ అమ్మాయిని అడుగుతోంటే..కస్సుమన్నాడు క్లర్కు.మా మామగారి పేరే కదండీ అని చెప్పి మా వారు మనోహరం గా నవ్వేసరికి క్లర్కు అమాంతం ఐసయిపోయి రిజిస్టర్ ఇచ్చేసాడు సంతకం పెట్టడానికి(ఇంతకీ మా వారు ఆయన పేరు కరక్ట్ గానే గెస్సారు..అదేనండీ గెస్ చేసారు.).నాకయితే ఎగిరి గంతులెయ్యాలి అన్నంత సంతోషం వేసింది.మా వారు నా మీద నమ్మకం ఉంచకపోయినా కాని ఇలాంటి ఆపరేషన్ సక్సెస్ చేసినందుకు.వెంఠనే రిజిస్టర్ అందుకుని గబ గబా నా ఆటోగ్రాఫ్ పడేసా..అంతే క్లర్కు గయ్యిన లేచాడు.హీహీహీ..లేవడా మరి...ఆ అమ్మాయి పేరు బదులు నా పేరుతో సంతకం పెడితే..
ఏవూరు నీది అడిగాడు సీరియస్ గా...మా వారి ఊరి పేరు చెప్పాను...ఇక చూసుకోండి..ఎలా తిట్టాడు అంటే...బ్యాక్ గ్రవుండ్ మ్యూజిక్ మీరు పెట్టుకున్న సరే,నన్ను పెట్టమన్న సరే,వెస్ట్రన్,ఫోక్ ఏదయినా ఓకే...పిచ్చి పిచ్చిపిచ్చి పిచ్చి గా తిట్టేసాడు ఆ ఊరి ప్రజలని,ఆ జిల్లా ప్రజలని.
.ఈయన గారికి సహోద్యోగుల గొంతులు కూడా కోరస్ కలిసాయి.ఇంకెముంది....జజ్జినకడి జనారే,జనకు జనా జనారే అన్నమాట.
ఆనాడు ఆ క్లర్కు గారి నోటి నుండి జాలువారిన మధుర భాషణములు మచ్చుకు కొన్ని..
దొంగ సంతకాలు చెయ్యడం,అవీ ఇవీ తీసుకుపోవడం,తరువాత మా పీకకి చుట్టుకోవడం అవన్నీ..ఆ అమ్మాయి ని అని ఏమి ప్రయోజనం..నీ కయినా బుద్ధి ఉండక్కర్లా...మీ జిల్ల ప్రజలంతా ఇంతే అనుకుంటా,దొంగ సంతకాలు,దొంగ బుద్ధులు....ఇంకా చాల తిట్టాడు లెండి.
ఆఖరుకి మా వారు సారీ చెప్పి కాస్త జేబు చమురు వదిలించుకుని ఆ సర్టిఫీకెట్ తీసుకుని బయట పడ్డాము.
ఆరోజు అలా మా వారి ఊరిని,వారి జిల్లా ప్రజలని ఇలా హోలు మొత్తం గా ఒకేసారి కడీగి పారేయిస్తానని ముందు తెలీదు కదా,తెలిసుంటే ఆరోజు పొద్దున లేవగానే తప్పక పాడుకునే దానిని...ఎన్నాళ్ళో వేచిన ఉదయం అని.ఛా..బంగారం లాంటి చాన్సు మిస్సు.
visit godsavemedia.wordpress.com
ReplyDeleteమీ బ్లాగ్గు శీర్షిక తమాషాగా ఉంది.మీ బ్లాగ్గు కూడా బాగుంది.
ReplyDeleteఏంటండీ బాబూ, మీ వారిని తిట్టుకొవడానికే blog మొదలు పెట్టినట్టున్నారు...పాపం. కానీ బాగా నవ్వించారు :D
ReplyDeleteమీ మెంతిబద్దల photo చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి...ఇప్పుడెలా...:(
Now I know... your's is Krishna Dt. People are cheats, right? :))
ReplyDeleteహ హ హ సూపరూ.. మరి తరువాత మీ ఇంట్లో మీవారి కి కధక్ ,కూచిపూడీ లాంటివి కంబైండ్ గా చేసి చూపించాలి కదా నన్ను ఇన్ని మాటలు అనిపిస్తారా అని :) ..
ReplyDeleteకలకాదు కదా అనుకున్నా కామెంట్లని చూసి...నా రాతలని ఎవరూ చదువుతారు ఇంత త్వరగా అనుకోలేదు,పిల్ల బ్లాగర్ ని కదా.
ReplyDelete@ మొదటి అనానిమస్,
ఈ యాడ్లేమిటండీ
@ శరత్ కాలం:
:)))
@ హరెఫల,
పేరు ఏమి పెట్టాలా అని ఆలోచిస్తోంటే,అప్పుడే వేసిన మెంతిబద్దలు కనపడ్డాయి ఎదురుగా,పెట్టేసా..
@ స్ఫురిత,
మీ పేరు బాగుంది. నా మెంతి బద్దలు చూసి నోరూరితే వెంఠనే మీరూ వేసెయ్యండి మామిడికాయ కోసేసి చకచకా...
@ రెండవ అనానిమస్,
జిల్లాల గొడవ ఎందుకు చెప్పండి,హాయిగా సరదాగా మాట్లాడుకుందాము ఇక్కడ.
@ నేస్తం,
నన్ను కాదుగా ఆ క్లర్కు తిట్టినది,అందుకే నేను నాట్యాలు గట్రా ప్రదర్శనలు పెట్టలేదు.మా వారు మాత్రం నా అమోఘ తెలివి తేటలకి నిదర్శనం గా ఇప్పటికీ
ఉదహరిస్తూ ఉంటారు ఈ సంఘటన ని. నేను మాత్రం నన్ను ఏమయినా అంటే ఈ బ్రహ్మాస్త్రాన్ని తీస్తాను,చెప్పాడుగా ఆ క్లర్కు అప్పుడెప్పుడో మీరు అంతా మోసగాళ్ళు,etc అని...:)
రచ్చ రచ్చ
ReplyDeleteసూపరు కుమ్మెశారు
ReplyDeleteఒక లెటర్ పట్టుకెల్లాల్సింది లేదా మీరే రాసేయాల్సింది తన సంతకం తో
మొత్తానికి కధ సుఖాంతం అయ్యింది కదా మీకు కాస్త వ్యధతో
"ఆ సర్టిఫీకెట్ తీసుకుని" - చివరికి ఇచ్చాడన్నమాట! దొంగవెధవ!!
ReplyDeletechala chala saradaga undi chadavadaniki.. kaani meeku aa roju chala tension padi untaru anu kunta
ReplyDelete