
ఎప్పుడూ చేసే బెండకాయ,వంకాయ కూరలు,పోపేసిన శనగలు,బజ్జీల లాంటి స్నాక్స్ బోరు కొట్టి కొత్తగా ఏమి చేద్దామా అని ఆలోచించి ఎలాగూ వంటల కార్యక్రమాలు వస్తుంటాయి కదా అని ఇప్పుడే మన తెలుగు చానెల్ లో ఒక వంట కార్యక్రమం చూసాను. వంట ల సంగతి దేవుడెరుగు కానీ ఇలాంటి కార్యక్రమాల మీద ఎందుకు ఇన్నిన్ని జోక్స్ పుట్టుకొస్తాయో అర్ధమయిపోయిందోచ్.
ఈరోజు ఒకావిడ అదేదో బిర్యాని,కార్న్ కబాబ్ చూపించారు.మన యాంకర్ ఆవిడని అడుగుతుంది ఈ కార్న్ కెబాబ్ ని నెయ్యి లేదా డాల్డా లో కూడా వేయించచ్చా అండీ అని. అసలే ఇలాంటి వంటకాలలో సగం పోషకాలు చచ్చి ఉంటాయి. ఇంకా వీటిని నెయ్యి డాల్డా లలో వేపి అనవసర కొవ్వు వంటికి పట్టించుకోవడం కాకపోతే మరేమిటి?
కెబాబ్స్ వేసి అవి వేగుతున్నప్పుడు యాంకరు "వీటిని ఒక వైపు వేపాకా మరోవైపు తిప్పాలాండీ" అని అడిగింది. అక్కడున్నావిడ సంగతేమో కానీ నాకయితే యాంకర్ ని గరిట తిప్పి ఒక్కటెయ్యాలనిపించింది.
మన సగం మంది యాంకర్లకి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎలాగూ లేదు.కనీసం రికార్డెడ్ ప్రోగ్రాంస్ లో అయినా ఇలాంటివి తొలగించచ్చు కదా.ఏమో లెండి ఇలాంటి పిచ్చి వాగుళ్ళు ఎన్ని ఫిల్టర్ చేసారో మన ముందుకి తెచ్చే ముందు :)
ఇంకో ప్రోగ్రాం లో ఒకావిడ కూరగాయల సిక్స్టీఫవో ఎయిటీఫయివో చూపించింది.
సగం కూరలని ముందు నూనె లో వేపి మరలా ఏదో పిండి పట్టించి మరలా నూనెలో నిండా ముంచి స్నానం చేయించి చివరాఖరికి గార్నిష్ అంటూ ప్లేటు చుట్టూ క్యారెట్టు,ఉల్లిపాయలు,ఎక్సెట్రా ఎక్సెట్రా. మాంచి బజ్జీలో,మంచూరియానో చేసి ప్లేటు లో పెట్టి చివరికి చుట్టూ గార్నిష్ అంటూ ఎన్ని పచ్చి ముక్కలు పెట్టినా చివరికి ప్లేటులో మిగిలేవి ఈ పచ్చి ముక్కలే.అంత మాత్రానికి ఆ హడావిడి ఎందుకో?

టీవీలలో వంటలు చేసే వాళ్లని చూస్తే హాచ్చర్యమేస్తుంది నాకు. ఎంత నీటుగా కనీసం నూనె చుక్క కింద పడకుండా ఎంత పెద్ద వంటైనా చేసెస్తారు.ముందర అదేదో చేసి చివరికి నూనెలో వేయించి తియ్యాలి అంటే ఎంత లేదన్నా నాకు ఓ రెండు మూకుళ్ళు,3-4 గరిటెలు,వంటింటి గట్టు మీద అక్కడక్కడా పిండి,నేల మీద ఒకటి రెండు కూరగాయ తొక్కులు కనీసం ఉంటాయి వంట పూర్తయ్యేసరికి.
హేమిటో,ఎప్పుడు నేర్చుకుంటానో అలాగ?
This comment has been removed by the author.
ReplyDeleteచాలా బాగున్నాయి మీ మెంతి బద్దలన్నీ ఇంతకీ ఈ మెంతి బద్దలు ఏ ప్రాంతం వి ? ఎక్కడివైనా బాగున్నాయి కమ్మగా చిరు చేదుగా కొంచం కారం గా ఉప్పు సమం గా వేడి అన్నం లో నువ్వుల ల నూనె తో కలుపుకు తిన్న కొత్త ఆవకాయ లా సంవత్సరమంతా ఇలా గే కొత్త ఆవకాయ రుచి చూపించండి అక్కా..
ReplyDelete''బంగాళ దుంపల్ని స్మాష్ చెయ్యాలి !''
ReplyDelete- నా ఫేవరెట్ టీవీ వంటల డైలాగ్ !
"బంగాళా దుంపల్ని స్మాష్ చెయ్యాలి" ....సుజాత గారూ, కేక! ఆ డైలాగ్ వంట సుందరి చెప్పగానే నేను ప్రతి సారీ నవ్వాపుకోలేను.
ReplyDeleteఇంకోటి చెప్పనా,ఇంట్లో ఎవరిదో పెళ్ళి జరుగుతున్నట్లు మోచేతుల దాకా, రెండు గోరింటాకు కోన్లు ఖాళీ చేసి వివిధ అరబిక్ డిజన్లు పెట్టుకోవడమే.......కాకుండా ఎప్పుడో తప్ప వాడని ఆ నెయిల్ పాలిష్ని గోళ్ళకి ముద్దలు ముద్దలు గా వేసుకుని బయలు దేరడం! ఆ నెయిల్ పాలిష్ రంగేమిటన్నది అసలు పట్టించుకోకపోవడం...ఇదంతా ఒక గృహ హింస!
హి హి హి .. బలే విషయం మీద మాట్లాడుతున్నారు, ఈ గోల ఈ మధ్య మా వూర్లు (అంటే అమెరికా) వచ్చి మొదలెట్టేరు ఈ గోల. ఒక్కో ఆవిడ బెమ్మాండమైన డిజైన్ చీర కట్టీ, కొంగు ఒక చేతి మీద వేసి ఆ చెయ్యి కదపకుండా, ఇంకో చేతి తో చేసి అవతల పారేసింది వంట (నిజంగానే పారేసి వుంటారు ఆ వంట)... నాకు కూడా మీకు లానే ఒక వంట చేసేసరికి చీర మీద కనీసం ఒక మరక ఐనా పడుతుంది.. :-( ఆమె భాష గుర్తు లేదు గాని టింగ్లిష్ లో ఇరగ తీసిందని కూడా గుర్తు.
ReplyDeleteసుజాత: బంగాళ దుంప స్మాష్.. హి హి హి కేక...
అమ్మో! ఈ టివి వంటల గోల గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఎన్నిసార్లు అభుకుంటా ఇంత నీటుగా, గోరింటాకు, నగలు వేసుకుని వంట ఎలా చేస్తారా అని?? ఇంకా డైలాగులు. అసలోళ్లకంటే ఆంకరమ్మల హడావిడి ఎక్కువ..
ReplyDeleteజ్యోతి గారు కూడా టి.విలో వంటల ప్రోగ్రాములు చేస్తారనుకుంటా. :)
ReplyDelete:-) చాలా రోజులైంది మీరు పోస్ట్ చేసి..
ReplyDeleteటీ వీ లో అయితే వాళ్ళకి బల్ల వెనక ఏమవుతుందో మనకి చూపించరు కదా.. రెండు ముక్కలు మూకుట్లో వేసి.. మిగిలినవి కాళ్ళ దగ్గర కుప్ప తొట్టిలో పడేసుకుంటారు కదా.. మనకీ కాళ్ళదగ్గర కుప్పతొట్టి, గాజు కప్పుల్లో తరిగినవీ, తురిమినవీ కూరగాయలూ గట్రా ఇస్తూ తర్వాత అవన్నీ కడిగి తుడిచిపెట్టేవాళ్ళుంటే..
ఆత్రేయా,
ReplyDeleteస్పందించినందుకు ధన్యవాదాలు. కొత్తావకాయ గుర్తు చేసి నోట్లో నయాగరా జలపాతాన్ని ఊరించావు :)
మొదటి సుజాత గారూ,
అవునండీ,కొత్తలో నాకు డవుటొచ్చేది ఈ డైలాగ్ విని,ఈ వర్డ్ తప్పు కదా అని.కానీ పదే పదే వినేసరికి వాళ్ళే కరక్టేమోలే,తెలుగు మీడియం చదువు కదా నాది అని సరిపెట్టేసుకునేదానిని :)
రెండో సుజాత గారూ,
>>ఇంట్లో ఎవరిదో పెళ్ళి జరుగుతున్నట్లు మోచేతుల దాకా, రెండు గోరింటాకు కోన్లు ఖాళీ చేసి వివిధ అరబిక్ డిజన్లు పెట్టుకోవడమే.......కాకుండా ఎప్పుడో తప్ప వాడని ఆ నెయిల్ పాలిష్ని గోళ్ళకి ముద్దలు ముద్దలు గా వేసుకుని బయలు దేరడం! ఆ నెయిల్ పాలిష్ రంగేమిటన్నది అసలు పట్టించుకోకపోవడం...ఇదంతా ఒక గృహ హింస!
నాకొచ్చిన కోనసీమ భాషలో చెప్పలంటే "కేకెట్టేసించారు"
భావనగారూ,
ఆ "మెరక" లో కూడా ఇవి తప్పట్లేదా అయ్యో.బాగా చెప్పారు,నిజంగానే పారేసుంటారు ఆ వంటలని.
జ్యోతిగారూ,
నా డవుటే అన్నమాట మీది కూడా.
క్రిష్ణప్రియగారూ,
బద్ధకం ఎక్సెట్ర ఎక్సెట్రా అండీ పోస్టు రాయడానికి.ఎంత హెల్పు చేసిచ్చే వాళ్ళునా నేను అంత నీటు గా చెయ్యలేను బాబూ :)
హేమిటో ఈ పిల్లలు అర్ధం చేసుకోరూ . . . ఎంచక్కా మొగుడి మీద ఈ వంటల ప్రయోగాలు చేయొచ్చుకదా . ఆయన గారూ ఆలూ లా స్మాషైపోయి వరాలిచ్చేయరూ !
ReplyDelete