Friday, February 18, 2011

కాస్త నీటు గా ఉండచ్చు కదా...
కట్టూ బొట్టూ లో "ఫ్యూజన్" విధానాన్ని పాటిస్తూ చూసే వాళ్ళని కన్ ఫ్యూజన్ కి గురిచేస్తూ ఉండే ఆడవాళ్ళ గురించి ఇది.

చాలా మంది ఆడవాళ్ళు ఎందుకో తమని తాము నీట్ గా ప్రజెంట్ చేసుకోవడానికి అస్సలు ప్రాధాన్యం ఇవ్వరు. ఎంత సేపూ ఆఫీసులో పని చేసామా బాసు మెప్పు పొందామా లేదా,ప్రమోషన్ ఎప్పుడు ఇవే ఆలోచనలు. కాస్త నీట్ గా ఉందాము అన్న స్పృహే ఉండదెందుకో.

నీట్ అంటే మోడర్న్ గా సగం సగం బట్టలో నూడుల్ స్ట్రాప్ టాప్సో వేసుకోమని కాదు. వేసుకున్న బట్ట ఏదయినా నీట్ గా వేసుకోవచ్చు కదా. చాలా మంది ఆడవాళ్ళని చూసాను ఆఫీసుకి ఎందుకొచ్చామా దేవుడా అన్న మొహం పెట్టుకుని వస్తారు, అస్సలు వీళ్ల మొహం లో చిరునవ్వే ఉండదు. తాము లేకపోతే ఆఫీసు తలకిందులయిపోతుంది అని బలం గా విశ్వసిస్తారు వీళ్ళు.

ఆఫీసుకి వస్తున్నాము నలుగురితో ఉన్నాము కాబట్టి గుడ్డిగా అనుకరించెస్తారు అన్నింటినీ.. వీళ్ళ పాత వాసనలు వదులుకోలేరు,అలాగే పూర్తిగా కొత్తదనానికి అలవాటు పడలేక సతమత మయ్యే స్త్రీలని చూస్తే నవ్వొస్తుంది నాకు.

ప్రస్తుతం హెయిర్ రీబోండింగ్ హవా నడుస్తోంది కాబట్టి తామూ ఓ పార్లర్ కి వెళ్ళి నిట్ట నిలువుగా 90 డిగ్రీలలో తమ జుట్టు ని చీపురు పుల్లల లాగ సాగదీయించుకుని వచ్చెస్తారు.

అది తమకి నప్పిందా నప్పలేదా అని కాదు లేటెస్ట్ ఫ్యాషన్ ఫాలో అయ్యామా లేదా ఇదే వీళ్ళ ఫిలాసఫీ.

ఓ వారం పది రోజులు జుట్టు ని అలా విరబోసుకుని సుతారం గా మధ్య మధ్య లో వెనక్కి తోసుకుంటూ(వీళ్ళకి ఆ సున్నిత మయిన మేనరిజం నప్పకపోయినా సరే) జనాలని చావగొట్తెస్తుంటారు. ఆ తరువాత చిన్న చిన్న గా కొత్త జుట్టు రావడం మొదలవుతుంది. ఇక అప్పుడు చూడాలి అందాన్ని.పార్లర్ మాట అటుంచితే కనీసం ఇంట్లొ చేసుకోగలిగే పరికరాలతో కూడా ఆ కొత్త జుట్టు ని స్ట్రెయిట్ చేసుకోరు. మెల్లిగా కొత్త గా వచ్చే వెంట్రుకల సంఖ్య పెరగడమో చేయించుకున్న స్ట్రెయిటనింగ్ పోవడమో జరుగుతుంది.

ఆ అందాన్ని చూసేకన్న కలగాపులగం గా ఉండే జానా రెడ్డి గారి ప్రసంగం వినడం మేలు.

ఈ జుట్టు విరబోసుకోవడం ఫ్యాషన్ ఏమో కానీ చూడలేక చస్తున్నా నేను చాలా మందిని. చక్కగా పొడుగు జుట్టున్న వాళ్ళు కూడా అలా దెయ్యాలా వదిలేయడం,నల్లగా నిగ నిగ లాడే ఆ జుట్టు మధ్యలో ఓ మాంఛి జిగేల్ మనే క్లిప్పు.

ఇక బట్టల విషయానికొస్తే రోం లో ఉన్నప్పుడు రోమన్ లా ఉండమన్నారని "దేశీ రోమన్" అవతారం ఎత్తుతారు చాలా మంది "లత" ల్లాగ ఉండే వనితలు వేసుకునే బట్టలని "మాను"ల్లా ఉండే తామూ వేసుకోవాలని పడే తాపత్రయంచూసి తీరాల్సిందే.

ఆ బట్టలు వేసుకున్నప్పుడు పోనీ దానికి తగ్గ యాక్సరరీస్ వేసుకుంటారా అంటే అదీ లేదు. బట్టల వరకే కాపీ. మిగతావి కొనుక్కోవాలంటే మనసొప్పదు.

టైటు లెగ్గింగ్,పైన ఓ స్టైలిష్ టాపు వేసుకుంటారు కానీ చెవులకి సేం ఓల్డ్ జూకాలు,కాళ్ళకి బండ పట్టీలు మాత్రం ఉండాల్సిందే.

బీడు భూముల్లా ఉండే పాదాలని కనీసం కవర్ చేసుకునే పాదరక్షలు కూడా వేసుకోరు.

తెలుగు స్త్రీలం చాలా మంది ఎక్కువగా పాదరక్షల మీద ఖర్చు పెట్టము. పెట్టాలి అని రూల్ కూడా లేదు.కానీ బట్టలకి సరిపోయే పాదరక్షలు వేసుకోవాలి కదా.ఉన్న రెండు మూడు జతలే అన్నింటి మీదకీ సరిపోయేవి కొనుక్కోవచ్చు కదా అనిపిస్తుంది నాకు. ఇలా చూసే వాళ్ళ కళ్ళని ఇబ్బంది పెట్టేబదులు తమ "బ్రాండు" డ్రెస్సింగుతో.

పోనీ వేసుకునే చూడీదార్లయినా మంచివి వేసుకొస్తారా అంటే అదీ లేదు. బబ్లింగ్ వచ్చినా సరే అవి వాడాల్సిందే ఆఫీసుకి. ఇలా ఉండే వాళ్ళెవరూ కొనుక్కోలేని వాళ్ళు కాదు. డబ్బులు వెనకెయ్యాలి ఇదే వాళ్ళ జీవిత ధ్యేయం.

ఇక మేకప్ విషయం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కాస్త కాంపాక్ట్ పౌడర్ వేసుకుని రెండంగుళాళ మందాన మూతికి రంగు పూసుకుని మేకప్ అయ్యిందనిపించేవాళ్ళు కోకొల్లలు.

పోనీ ఆ మేకప్ చివరి వరకూ నిలుస్తుందా అంటే అదీ లేదు. పదకొండయ్యేసరికి చెదిరిపోతుమంది. ఆఫీసుకి పొద్దున్న వెళ్ళామంటే ఇంకంతే,మళ్ళీ సాయంత్రం ఇంటికెళ్ళేవరకు మొహం చూసుకోరు. లకలక జ్యొతిక లా ఉన్నా సరే అలా చెదిరి పోయిన జుట్టుతోనే మీటింగులకొచ్చి మీటింగు ని క్షణ కాలం స్తంభింప చేసే చాతుర్యం వీళ్లకే సొంతం.

ఇలా చెప్పుకుంటూ పోతే దీనికి అంతుండదు కానీ ఇలాంటి వాళ్ళని మీరూ చూసి ఉంటే చెప్పండి మరి.

16 comments:

 1. ఓయ్ తెలుగింటమ్మాయ్, బాగా రాశావ్ !!
  ఇంకో విషయం మర్చిపోయావ్
  మాములప్పుడు ఎలా పడితే అలా ఉండి, ఇంట్లో వాళ్ళను వాళ్ళ అవతారం తో దడిపించి,
  ఎవరి పెళ్ళికో, ఎవరి ఫంక్షన్ కో పార్లర్ కెళ్ళి మొహం తోమించుకోవటం,
  చీర రివర్స్ సైడ్ కట్టుకోవటం లాంటివి చేసే సమాజ సేవికల గురించి రాయలేదే?
  ఇట్లు
  తెలుగింటి నాన్న

  ReplyDelete
 2. మీరు నూరేళ్ళు చల్లగా ఉండాలమ్మాయి గారూ

  ReplyDelete
 3. బాగా చెప్పారు

  ReplyDelete
 4. ఆ అందాన్ని చూసేకన్న కలగాపులగం గా ఉండే జానా రెడ్డి గారి ప్రసంగం వినడం మేలు.
  ఈ వాక్యం చాలా బాగుంది, నవ్వు ఆగలేదు.

  ReplyDelete
 5. నిజమే నాకూ కొంత మంది ని చూస్తుంటే , ఈ సరిపడని ఫేషన్లేమిటి హాయిగా నీట్ గా వుండొచ్చుకదా అనిపిస్తుంది .

  ReplyDelete
 6. సూపరండి, అదరగొట్టారంతే :)

  ReplyDelete
 7. బబ్లింగ్ వచ్చినా సరే అవి వాడాల్సిందే ఆఫీసుకి.

  బబ్లింగ్ ante entandi ? nice article.I'm with you on seeing people leave their hair without tying.It just won't suit 99% people,including heroines like priyanka chopra in a hair shampoo ad.God save us !

  ReplyDelete
 8. Also,I'm interested to know your opinion on make-up.Compact powder is the simplest makeup one can put on.Are you saying women shouldn't even use compact or if they use, they should touch up every few hours ?

  ReplyDelete
 9. meeru cheppinadi fashion ga vundalana leka simplega fresh ga vundalana ardham kaledu.pls.

  ReplyDelete
 10. ఆత్రేయ ,సుజాత,స్నేహ,రవి,మాల కుమార్,మొదటి అనానిమస్ గార్లకి

  ధన్యవాదాలండీ.

  రెండవ అనానిమస్ గారూ,

  బబ్లింగ్ అంటే ఎలా చెప్పాలో తెలీట్లేదు.

  మూడవ అనానిమస్ గారూ,

  కాంపాక్ట్ పవుడర్ ఎవరి చర్మ తీరు కి తగ్గట్లు వారు సెలక్ట్ చేసుకుంటే టచప్స్ అవసరముండదు లెండి.వేసుకోవాలి కాబట్టి ఏదో ఒకటి వేసుకుని కామెడీ గా ఊండొద్దాని చెప్పడం నా ఉద్దేశ్యం.

  నాలుగవ అనానిమస్ గారూ,

  రెండూ కాదండీ. ఏది వేసుకున్నా నీట్ గా కాస్త సూటయ్యేవి వేసుకోమని. Weird combinations వద్దని నా ఉద్దేశ్యం.

  ReplyDelete
 11. konnchem neat ga ela undali, nice make up ela vesukovali chepparu.. nijam ga request ee.

  ReplyDelete
 12. 5th anonymous,

  You can take the help of many such blogs/sites dedicated to this stuff.

  ReplyDelete
 13. please babling ki english spelling emaina unte cheppandi, net lo vetukkuntaam, ledu telugu lone kaasta prayatninchandi. doodi, pogulu levatamenaa ? ( context batti adenemo anukuntunnaa ).

  mee blog naaku baaga nachindi.

  ReplyDelete
 14. ఆ అవునండీ మీరు చెప్పినదే బబ్లింగ్ అంటే. దాని స్పెల్లింగ్ Bubbling.

  ReplyDelete
 15. బాగుందండీ టపా...కాలేజీల్లో అమ్మాయిలు మిడీ టాప్ వేసుకుని కాళ్ళకి పసుపు రాసుకుని గల్లు ఘల్లుమనే పట్టగొలుసులు వేసుకొస్తారని మా కసిన్ జొక్ చేసింది మొన్ననే!!!!!

  ReplyDelete
 16. ఎన్నెల గారూ
  స్వాగతం..మా ఆఫీసులో ఓ అమ్మాయి కొంచం ఇలాగే వస్తుంది. కానీ ఎబ్బెట్టు గా ఉండదు. ఆ అమ్మాయి స్కర్ట్ వేసుకుని చేతికి దాదాపు సగం పైన గాజులు వేసులుంటుంది అప్పుడప్పుడూ. ఇలాంటివి నప్పితే ఎబ్బెట్టు స్థానే ముద్దు గా అనిపిస్తారు :))

  ఒకరలా చేసారని మర్రి మానుల్లా ఉన్న వారందరూ దానినే కాపీ కొడితే చచ్చిపోతాము.

  ReplyDelete